దేవులపల్లి వారి ఆండాళ్ తిరుప్పావు కీర్తన

ఆండాళ్ తిరుప్పావు కీర్తన 
దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన 

చిన్నప్పటి ధనుర్మాసం జ్ఞాపకాలు
ధనుర్మాసం అంటే పొద్దున్నే భక్తి రంజని (AIR Telugu Devotional show) లో తిరుప్పావై కార్యక్రమం - వారి పేరు తెలియదు కానీ తమిళ్ పాశురాలను తెలుగులో అర్థం చెప్తూ ఎంతో గొప్పగా వ్యాఖ్యానం చేసేవారు అది అయిన తరువాత M L వసంత కుమారి గారి తిరుప్పావై పాశురం వినడం, ఆ తరువాత ఒక అన్నమాచార్య కీర్తన.

తెలుగులో తిరుప్పావు కీర్తనలు
ఒకసారి ఎప్పుడో శ్రీ దేవులపల్లి వారు తిరుప్పావై తెలుగు చేశారని తెలిసింది. వెంటనే నాకు తెలిసిన పెద్దవాళ్ళని అడగడం మొదలుపెట్టాను. 

రచయిత్రి మృణాళిని గారు, కవి శ్రీ చినవీరభద్రుడు గారు, వంటి సాహితీవేత్తలు నాకు worldspace రేడియో లో రేడియో స్పందన (తెలుగు ఛానల్) లో పని చేసేటప్పుడు పరిచయం అయ్యారు.  నేను అసిస్టెంట్ ప్రోగ్రాం డైరెక్టర్/వ్యాఖ్యాత (RJ) గా పని చేశాను.  ఆ సమయంలోనే వీకెండ్ షోస్ ద్వారా ఎన్నో గొప్ప విషయాలు వీరు పంచుకునే వారు.  

తెలుగు కవిత్వం అంటే ఎంతో మక్కువ అయిన చినవీరభద్రుడు గారిని ఈ తిరుప్పావు కీర్తనల పుస్తకం గురించి అడగగానే వెంటనే వెతికిపెట్టి మాకు అందేలా చేశారు. 

ఆ పుస్తకం అందగానే ఎంతో ఆనందంగా అనిపించింది. 


కృష్ణశాస్త్రి గారు వ్రాసిన ముందు మాట చదివి తీరాల్సిందే...

'ఏనాటివో ఈ నాటికలు!
ఎప్పటివో గాని ఈ పద్యాలూ, పాటలూ
ప్రసంగ వ్యాసాలూనూ !
ఎప్పుడెప్పుడో గెలికినవీ బరికినవీని.
దూరాన నుంచి వెన్నంటి వచ్చాయి, ఎవరో చిరపరిచితుడైన
బాటసారి పద ధ్వనులు లాగున - నన్ను వదలకుండా !'

అని అంటారు. ఎలాగైతే గోదా దేవి అతి చిన్న ప్రాయంలోనే స్వామివారిలో ఐక్యం అయిపోయిందో, తన కూతురు సీత కూడా అలాగే వెళ్ళిపోయింది అని అంటూ ఆ విష్ణుచిత్తుల వారి బాధను పంచుకున్న సాటి తండ్రిలా ఈ కీర్తనలను ఆమెకే అంకితం చేశారు.

'మును పెరియాళ్వారుల గీ
మున గోమున పెరిగి, భువన మోహనుడౌ రం
గనిజేరి, నిత్యావసతిం
గొనె శూడికుడుత జగానకున్ తాయారై'   




ఈ పుస్తకం లో శ్రీ ఆండాళ్ తిరుప్పావు కీర్తనలు, 'శ్రీ ఆండాళ్ళు' శ్రవ్య నాటిక, తిరుప్పావు కీర్తనల నొటేషన్ ఉన్నాయి. ఈ కీర్తనలకు సంగీతం చెయ్యడమే కాక ఈ కీర్తనలు వ్రాయడానికి ప్రేరణ శ్రీమతి అమృతవల్లి సుందరం.  వీరు ఒకసారి దేవులపల్లి వారి ఇంటికి వచ్చినప్పుడు తిరుప్పావై పాశురాలు పాడారట. అది విని దేవులపల్లి వారికి వాటిని తెలుగు చేయాలనే సంకల్పం కలిగింది.

'అమృతవల్లి నాకు తిరుప్పావైలో ఒకటి రెండు పాడి వినిపించింది.  వెంటనే నాకు తోచింది - నా చిన్నతల్లి సీతమ్మను తలుచుకుంటూ తిరుప్పావు తెలుగులో కీర్తనలుగా వ్రాయాలని.'

అని వ్రాసుకున్నారు దేవులపల్లివారు ఈ పుస్తకాన్ని శ్రీ దేశముఖ్ దంపతులకు అంకితం ఇస్తూ.

మొట్టమొదటి కీర్తన 
హరియే పాడించాలి అనే ఆవాహన కీర్తనల తరువాత 'రారమ్మ ఓ అమ్మలారా' అనేది మొట్టమొదటి ఆండాళ్ కీర్తన. అమృతవల్లి గారు ఈ కీర్తనని బిలహరి రాగం, ఆదితాళం లో కూర్చారు. 

అయితే ఈ కీర్తన చూసినప్పుడు నాకు దీని మీటర్ కొంచం వేరుగా అనిపించింది.  పైగా ఈ కీర్తనలకు తెలుగు లలిత సంగీత బాణీ అయితే ఇంకా బాగుంటుంది అనిపించింది. 


అందుకని ఒక మిశ్ర దేశ్ రాగ ఛాయలో ఈ కీర్తనని పల్లవి చతురశ్రం లోను చరణాలు ఖండ గతిలోను చేశాను.  నేను సౌమ్య కలిసి పాడాము.


రారమ్మ ఓ అమ్మలారా_దేవులపల్లి_ఆండాళ్ తిరుప్పావు కీర్తన  - వీడియో లింకు. కీర్తన ఇక్కడ వినండి. 

అల్ ఇండియా రేడియో వారు దేవులపల్లి వారి చేత శ్రీ ఆండాళ్ళు అనే శ్రవ్య నాటిక వ్రాయించారు. సంగీతనాటిక అది, అందులో ఎన్నో మంచి కీర్తనలు వ్రాశారు దేవులపల్లి వారు - త్వరలోనే అది కూడా మీకు వినిపిస్తాము.

ఇట్లు
సుష్మ
సాపాసా

Comments

I do not know whose blog this is. I sing the tiruppavai of Andal and looking the telugu translation of that. I have seen the telugu equvilents of the tiruppavai, written by one swami near machlipatnam. I was looking into devitional songs of Devulapalli Krishna sastry and have seen the Devulapalli effort to the Tiruppavai equivalent in telugu. Kindly tell me how to get this. My name is K.S.Ramanujam and my email is kuram.rjam@gmail.com
S said…
Madam,can you please post a link for cheekaaku padaku chidimudi padaku. Think it was translation of thiruppavai by Devulapallivaru. I recall listening to it in AIR.Thank you.
Nukireddy said…
ఎప్పుడు వినిపిస్తారు
Nukireddy said…
Ee pustakam dorakutundaa andi