ఒక సంక్రాంతి పండుగ కథ - ఈనాటి సంక్రాంతి (ఆడియో)


సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో సాపాసా రూపొందించిన ఒక కథ, మీరు ఇక్కడ వినచ్చు ...


వ్యవసాయం ఇప్పుడు కేవలం ఒకరికే పరిమితం అవుతున్న వృత్తి కాదు.  passion ఉన్నవారు ఇష్టంగా చేస్తూ లాభాల బాట నడుస్తున్నారు.  ఎన్నో real life success stories ఉన్నాయి.  2017లో మేము organeek అనే కంపెనీ వారు నిర్వహించిన farm visit కి వెళ్ళాము.  అక్కడ రైతు సేంద్రియ పధ్ధతి లో వ్యవసాయం చేస్తూ నష్టాలలో కూరుకుపోయిన అప్పులపాలైన తన పొలాన్ని జీవితాన్ని ఇప్పుడు పూర్తిగా మార్చేసుకొని ఆదర్శ రైతుగా పేరు, చక్కని లాభాలు సంపాదించుకున్నారు.  

అలాగే మొన్న ఒక చోట farmizen అనే అప్ ఒకటి ఉందని తెలిసింది.  మీకు వ్యవసాయం అంటే ఇష్టం ఉంటె చాలు.  ఒక రైతు తన పొలం లో ఒక  చిన్న ప్లాట్ ని నెలకి ఇంత అని చెల్లించి అద్దెకు ఇస్తాడు.  మనకి ఇష్టమైన పంటలు/కూరగాయలు అవ్వి పండిస్తూ, ఆప్ ద్వారా updates ఇస్తూ ఉంటారు.  నెలకోసారో ప్లాన్ చేసుకొని మీ ప్లాట్ లో మీరు పని చేసుకోవచ్చు.  పంట చేతికి వచ్చాక అది మీదాకా చేరవేసే బాధ్యత కూడా రైతులే తీసుకుంటున్నారు. 

ఇటువంటి వినూత్నమైన ఐడియాలతో కొత్తతరం వ్యవసాయాన్ని మరో స్థాయికి తీసుకువెళ్తున్నారు.  ఈ సక్సెస్ స్టోరీ నుంచి inspire అయ్యి, దానికి సరదాగా ఒక లవ్ స్టోరీ ని జోడించి ఈ సంక్రాంతి కథను తయారు చేశాము.  ఇది హాయిగా వినచ్చు ఎప్పుడంటే అప్పుడు.  పైన  లింక్ లో ఈ కథను వినండి. 

ఈనాటి సంక్రాంతి! ఆడియో స్టోరీ. 

సంక్రాంతి శుభాకాంక్షలు 

సుష్మ 
సాపాసా 

Comments