Sa Pa Sa ku swagatham!

సా పా సా ఛానల్ కు స్వాగతం 




సా పా సా అంటే షడ్జ పంచమాలు - ఈ స్వరాల మధ్యనే మొత్తం సంగీతం ఇమిడి ఉంటుంది.  సా పా సా ఛానల్ లో తెలుగు వెబ్ సిరీస్ ని మీరు చూస్తారు - సంగీతానికి సంబింధించిన అంశాల విశ్లేషణ ఉంటుంది ఎపిసోడ్స్ లో.  తెలుగు సినీ సంగీతం, లలిత, కర్ణాటక, వెస్ట్రన్, ఇలా అన్ని రకాల సంగీత ప్రక్రియల పరిచయం, విశ్లేషణ, పాడుతూ మాట్లాడుతూ చెయ్యడం జరుగుతుంది. మేము ఇద్దరం అక్క చెల్లెళ్ళం - సుష్మ సౌమ్య. 









అలాగే ప్రత్యేకంగా పిల్లల కోసం మంచి కార్యక్రమాలు ఉంటాయి - చక్కని పాటలు, ఇంకా పద్యాల తో పద్యాబాలశిక్ష అని సిరీస్ ఉంటాయి.  పిల్లలకి మంచి సంగీత సాహిత్యాలని అందించాలని మా సంకల్పం. 

మంచి షార్ట్ ఫిలిమ్స్ కూడా ఈ ఛానల్ లో మీరు చూడచ్చు - తెలుగు లో ఉంటాయి ఇవ్వి - మంచి అవార్డులు కూడా వచ్చాయి. 

ఇంకా దేశభక్తి గీతాలు, తెలుగు లలిత సంగీతం, కర్ణాటక కృతుల విశ్లేషణలు - ఇలా ఎన్నో మంచి వీడియో లు ఇక్కడ మీరు చూడచ్చు 





ఇట్లు 
సా పా సా 

Comments