2015, ఫిబ్రవరి, శివరాత్రి పండుగ రోజున ఈ వెబ్ సిరీస్ మొదలుపెట్టాము. స్వయంగా సంగీత స్వరూపుడైన శివుని స్తోత్రాలతో కంటే ఇంక మంచి మొదలు ఏముంటుంది?
![]() |
our first logo/representation picture of Sa Pa Sa |
మా తయారీ
మేము మూడో అంతస్తు లో ఉండేవాళ్ళం - ఆ ఇంటి పక్కన విశాలమైన మేడ - పాత తెలుగు సినిమాల్లో చూపించినట్టు గా - పూల కుండీలు, పెద్ద పొన్న చెట్టు - ఇలా .. ఇదే మా సా పా సా కి విడిది. ఎపిసోడ్ లో మీరు పక్షుల కువకువలు, అమ్మేవారి గొంతులు అన్ని వింటారు - అచ్చం మనం చిన్నప్పుడు మీద కూర్చుని కబుర్లు చెప్పుకున్నట్టు గా ఉంటుంది వాతావరణం.
![]() |
Sa Pa Sa season 1 location |
మొదటి ఎపిసోడ్
ఏంటి ఈ ఎపిసోడ్ లో విషయం?
చిన్నప్పటి నుంచి మనం విన్న శివ స్తోత్రాలు, సినిమాలో విన్నవి, రేడియో లో విన్నవి ఇవే కాక కొన్ని అపురూపమైన స్తోత్రాలు - అన్నిటిని కూర్చి తయారుచేశాం ఈ ఎపిసోడ్ ని.
చిన్ననాటి స్మృతి - శివ స్తుతి కాస్సెట్టు - బాలు గారి గళం లో
లింగాష్టకం - అష్టకం అంటే 8 చరణాలు ఉన్నదని అర్ధం. శివుని స్తోత్రాలన్నింటి లోకి లింగాష్టకం చాలా ప్రసిద్ధి చెందింది. 'తత్ ప్రణమామి సదా శివ లింగం' అని వెంటనే అందుకుంటారు అందరు. ఈ స్తోత్రం ఎవరు వ్రాశారు అని చుస్తే ఆది శంకరుల వారని అనుకున్నాం కానీ ఇది అగస్త్య మహా ముని రచన అని ఇటీవల రీసెర్చ్ లో తేలింది.
ఇక ఈ స్తోత్రం ట్యూన్ గురించి చెప్పాలంటే, 1980 ల్లో Saregama (HMV) ఒక కాస్సెట్టు తెచ్చారు - ఒక వైపు భద్రాచల రామదాసు కీర్తనలు, మరో వైపు శివ స్తుతి. ఇటు వైపు అమృతం లాంటి బాలమురళి కృష్ణ గారి గళం, అటువైపు అద్భుతమైన బాలు గారి గళం, ఏం కాస్సెట్టండి!!
శివ స్తుతి బాలు గారి గొంతు లో ఇక్కడ వినండి The original SPB Siva Stuthi

ఈ పాటలు అలా వినిపిస్తూనే ఉండేవి ఇంట్లో - పాత Phillips stereo cassette recorder cum player లో, అమ్మ ఎక్కువగా వింటూ మాకు వినిపిస్తూ ఉండేది. మాకు పాటలన్ని మధ్యలోని interludes తో సహా బట్టి వచ్చేసాయి. ఒక్కసారి మొదలుపెడితే అచ్చం క్యాసెట్ లాగ ఒకటి తరువాత ఒకటి అందేసుకొని పాడేస్తూ ఉంటాం ఇప్పటికి :)
ప్రభుమ్ ప్రాణనాధం - బాలు గారు ఒక వీర శైవ భక్తి తత్పరతతో పాడారనిపిస్తుంది ఈ స్తోత్రాన్ని - మనం పాడేటప్పుడు కూడా అలాగే అందుకుంటూ ఉంటాం వారి స్టైల్ లో.
ఈ ఆల్బం లో పుహళేంది గారు వాడిన కర్ణాటక రాగాలు:
లింగాష్టకం - శివరంజని
ప్రభుమ్ ప్రాణానాధం - మోహన
విశ్వనాధాష్టకం - దర్బారీ కానడ
బిల్వాష్టకం - కనకాంగి
భక్తి రంజని - అల్ ఇండియా రేడియో

విశ్వేశ్వరాయ - దారిద్ర దహన స్తోత్రం ఇప్పటికి బాగా గుర్తు - శ్రీరంగం గోపాలరత్నం, వోలేటి వెంకటేశ్వరులు గార్ల గొంతులు అలా వినిపిస్తూ ఉంటె సింధుభైరవి లో ఒక పవిత్రమైన వాతావరణం ఏర్పడేది ఇంట్లో. కింద లింక్ లో ఈ స్తోత్రం ఒరిజినల్ వినచ్చు.
Here is the original recording Visweswaraya - Daridrya Dahana Stotram
శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం
చాలా కాలం క్రితం మేము కొత్తింట్లోకి చేరినప్పుడు మా పొరుగింట్లోంచి అమృతం లాంటిదేదో వినిపించడం జరిగింది - అదేంటో విని తెలుసుకొనే దాకా వదల్లేదు - ఆ స్తోత్ర మహిమ, ఆ సంగీత మహిమ లాంటిది మరి. మాములు గా అందరిళ్ళల్లో 'కౌసల్య సుప్రజ రామ' అని వినిపిస్తుంటే ఇక్కడ 'శ్రీశైల మల్లికార్జున విభో తవ సుప్రభాతం' అని వినిపించేది.
శ్రీశైలం లో ఇప్పటికి ఇదే సుప్రభాతం వినిపిస్తుంది (మేము వెళ్ళినప్పుడు అయితే విన్నాం). ఇది శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం - స్వరకర్త పి బి శ్రీనివాస్ గారు. వారే పాడారు జానకి గారి తో కలిసి - ఇద్దరి గళాలు వింటుంటే అర్ధనారీశ్వర తత్త్వం మనకి అర్ధం అవుతుంది... 24 నిముషాలు ఎటు వెళ్ళాయో తెలియనంత గొప్ప సంగీతం కట్టారు పీ బి శ్రీనివాస్ గారు. మొత్తం ఇక్కడ వినచ్చు.
Here is the original recording Srisaila Mallikarjuna Suprabhatam
ఈ మొత్తం సుప్రభాత స్తోత్రం, మంగళాశాసనం, ప్రపత్తి అన్ని ఒక్కో శ్లోకం ఒక్కో రాగం లో ఉంటాయి - అవ్వి ఇక్కడ పొందుపరిచాను.
ప్రాతః స్మరామి - నాట
కాలాభ్యాం - గౌళ
నమస్తే మహాదేవ శంభో - ఆరభి
శశ్వత్ శ్రీ గిరి - వరాళి
సోమార్దంకిత మస్తకాం - శ్రీ
(ఘనరాగ పంచకాలు - గమనించారా?)
(ఘనరాగ పంచకాలు - గమనించారా?)
మాతః ప్రసీద - భూపాళం
శంభో సురేంద్రనుత - మోహన
విశ్వేశ - మలయమారుతం
గౌరీ మనోహర - గౌరీ మనోహరి
నాగేంద్ర భూషణ - శంకరాభరణం
(ఈ పై రెండు రాగాలు భలేగా ఎన్నుకున్నారు కదా!)
(ఈ పై రెండు రాగాలు భలేగా ఎన్నుకున్నారు కదా!)
సృష్టన్త్వయైవ - ఖరహరప్రియ
ఇకస్త్వమేవ - శహన
పాతాళ గాంగ జల - సారంగ
పాతాళ గాంగ జల - సారంగ
సారస్వత - మాయామాళవగౌళ
ఫలస్తుతి శ్లోకం - దర్బార్
నమశ్శివాభ్యాం - లతాంగి
అనఘం - వసంత భైరవి
శివమ్ శంకరం - సారమతి
భృంగీచ్చా - హిందోళ
సోమోత్తంసః - ఆనంద భైరవి
ఏణం పాణౌ - కాపి
శ్రీశైలే స్వర్ణ శృంగే - ముఖారి / భైరవి
భ్రమరాంబా స్తుతి
యా యోగి బృంద - యడుకుల కాంభోజి
కస్తూరి తిలకాంచితే - బేగడ
రాజన్ మత్తమరాళ మందగమన - కేదారగౌళ
శ్రీనాథ మరియు ఉభౌ దర్వి కుంభౌ - షణ్ముఖప్రియ
మంగళాశాసనం - హిందోళ
గౌరీ మనోహర సురాసుర - పంతువరాళి
భక్తార్తి హార - దర్బారీ కానడ
భృంగీశ సేవిత - హంసధ్వని
నాగేంద్ర చర్మవసన - ధన్యాసి
సర్వార్తి భంజన - శుభ పంతువరాళి (పంతువరాళి వేరు ఇది వేరు)
శ్రీ భ్రహ్మరీశ - అభోగి
నాగేంద్ర చర్మవసన - ధన్యాసి
సర్వార్తి భంజన - శుభ పంతువరాళి (పంతువరాళి వేరు ఇది వేరు)
శ్రీ భ్రహ్మరీశ - అభోగి
సర్వాగమ స్తుత - చారుకేశి
శంభో - శుద్ధ సావేరి / దుర్గ (చివరి శ్లోకం)
ఇంకొన్ని శ్లోకాలు ఎక్కువ ప్రసిద్ధి లో లేనివి
ఇంకొన్ని శ్లోకాలు ఎక్కువ ప్రసిద్ధి లో లేనివి
చంద్రాభా - వలజి రాగం - శ్రీమతి బి హరిప్రియ (హైదరాబాద్ సిస్టర్స్)
కర్పూరగౌరం - వసంత రాగం - సుష్మ నిట్టల
ఈ శ్లోకం లో 'వసంతం' అని వస్తుంది అయితే అది నివసించడం అనే అర్ధం లో వస్తుంది - కానీ వసంత లో ట్యూన్ చేస్తే బాగుంటుంది అనిపించింది
వందే శంభుముమాపతిం - సారమతి - సుష్మ నిట్టల
తెలుగు సినిమాల్లో ని కొన్ని శ్లోకాలు, స్తోత్రాలు
శివ తాండవ స్తోత్రం - గాలిపెంచెల నరసింహ రావు
రావణాసురుడు చాలా గొప్ప పండితుడు - ఈ స్తోత్ర రచన చేసింది రావణుడే - అలాగే కర్ణాటక సంగీతం లో ఆది తాళం కూడా రావణుడే ఏర్పరచాడని కర్ణాటక సంగీత చరిత్ర లో చదువుకున్నాము. ఈ విశేషాలతో మరో సిరీస్ లో ప్రస్తావిస్తాము.
వాగర్దావివ సంపృత్తౌ - ఇళయరాజా గారు
Here is the original - Vagardhaviva samprutthou - Sagarasangamam
అక్షరాయనమః - హంసలేఖ (భారవి గారి రచన)
Here is the song from Sri Manjunatha (Aksharaya Namaha)
Here is the song from Sri Manjunatha (Aksharaya Namaha)
(ఈ పాట అందులోని విశేషాల గురించి మరోమారు ప్రస్తావిస్తాము)
శివ విశ్వరూప స్తుతి
మా ఇంటి ఎదురుగా కొపెల్ల వాసుదేవ రావు గారు ఉండేవారు. వారు సంగీత సాహిత్య ప్రియులు, ఆధ్యాత్మిక విశ్లేషకులు. మా సంగీత సాహిత్య రుచి ని తెలుసుకొని మాకోసం ఒక చాలా అపురూపమైన శివ స్తోత్రాన్ని ఇచ్చి ట్యూన్ చేయించారు - అదే ఈ శివ విశ్వరూప స్తోత్రం. నేను ఆ స్తోత్రాన్ని తిల్లంగ్ రాగం లో కట్టాను.
ఇదండీ మొదటి ఎపిసోడ్ విశేషాల బ్లాగ్ ...
yours musically
Sushma Nittala
Comments