విశ్వనాథ వారి శ్రీ గిరి శతకం

సా పా సా 
శివస్తుతి 
విశ్వనాథ సత్యనారాయణ వారి శ్రీ గిరి శతకం 


ఏమిటీ శివ స్తుతి?
సా పా సా వెబ్ సిరీస్ లో భాగంగా ప్రతి సోమవారం శివస్తుతి శీర్షిక నిర్వహిస్తున్నాం - ఇందులో శ్లోకాలు, పద్యాలూ, కీర్తనలు, అన్ని శివునికి సంబంధించినవి సంగీతం కూర్చి పాడుతున్నాం,  గత కొన్ని వారాలుగా. 

ఈ శివ స్తుతి చాలా ప్రత్యేకం ఎందుకంటే...  
ఈసారి ఒక అపురూపమైన పద్యాన్ని శివస్తుతి లో పాడాము .. అదే ... కవి సమ్రాట్టు...  
(సామ్రాట్టు అని దీర్ఘం అనకూడదట - తనికెళ్ళ భరణి గారు కరెక్ట్ చేశారు - సంస్కృతం లో దీర్ఘం స్త్రీ లింగం కి వర్తిస్తుంది) కళా ప్రపూర్ణ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ వారి శ్రీ గిరి శతకం లోకి మొట్టమొదటి పద్యం. 

ఈ శతకం విశ్వనాథ వారి మధ్యాక్కర రచన - పద్యాల గురించి తెలిసినవారికి అర్థం అవుతుంది - ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ, వారి ప్రత్యేకత కూడా. 

అటువంటి అపురూపమైన శతకం లోని పద్యం శివస్తుతి లో భాగం అయింది అనుకోకుండా!
విశ్వనాథ వారి శ్రీ గిరి శతకం పుస్తకం - 1965

ఈ పుస్తకం 1965 లో ప్రచురించారు.  దీని ప్రత్యేకత ఏంటంటే ఆచార్య ఖండవల్లి లక్ష్మీ రంజనం గారు ఈ శతక పద్యాలకు ప్రతి దానికి English లో అర్థం వ్రాసారు - translate చేశారు. 



ఆచార్య ఖండవల్లి లక్ష్మీ రంజనం గారి ఆంగ్ల అనువాదం

శ్రీ గిరి శతకం మాకు అనుకోకుండా దొరికింది.. హైదరాబాద్ లోని లిబర్టీ దగ్గర ఒక పాత బుక్ స్టోర్ ఉంది - దాని పేరే లిబర్టీ బుక్ స్టోర్ - చాలా పాతది, సెకండ్ హ్యాండ్ పుస్తకాలని అమ్ముతారు -  దాని శకం ముగియడం తో పుస్తకాలని కిలోల చప్పున అమ్ముతున్నారని తెలిసి నేను సౌమ్య వెళ్లాం - పాత తెలుగు పుస్తకాలు కావాలని అడిగాం. అప్పుడు దుమ్ము కొట్టుకుని పోయి - అచ్చం మట్టి లో మాణిక్యాల్లాంటి తెలుగు పుస్తకాలు కొన్ని దొరికాయి - అందులో శ్రీ గిరి శతకం ఒకటి.  పుస్తకం చూసి మా ముఖం లోని వెలుగు చూసి వాటి విలువ అక్కడ అమ్మేవారికి అర్థం అయిపొయింది - వాటిని కిలోల లెక్క అమ్మలేదు వాళ్ళు - పూర్తి వెల ఇచ్చే కొన్నాం - విలువ కట్టలేని పుస్తకాలు మరి!

పద్యం - ఆంగ్ల అనువాదం 
శ్రీశైల మల్లికార్జున మహాలింగ అనేది ఈ శతకం యొక్క మకుటం. 
అందుకని 'శ్రీ' రాగం లో ఈ పద్యాన్ని కూర్చడం జరిగింది. 



  
శ్రీ విశ్వనాథ సత్యనారాయణ వారి శ్రీ గిరి శతక పద్యం 

శ్రీ నీరధి నిషంగ, భక్త జనతతి శ్రేయోనుషంగ!
మానాథశరసంగ, ప్రౌఢ వృషభ రాణ్మా ద్యుత్తరంగ!
క్ష్మానూతన శతాంగ! సంగాతోష్ణీ ష సౌరంబుభంగ !
శులాభిషంగ! శ్రీశైల మల్లికార్జున మహాలింగ!

ఆచార్య శ్రీ ఖండవల్లి లక్ష్మీ రంజనం గారి ఆంగ్ల అనువాదం 

Oh Lord! for whom the oceans are the quivers, who is devoted to the well being of devotees; one to whom Lord Vishnu is the arrow; for whom the fatty bull is the furious charger; one who made a novel chariot of earth itself; for whom the waves of the holy Ganges form the folds of the turban; one who bears the trident as a favourite weapon; Oh, thou, the Great Mallikarjuna Linga of Srisaila!


మాకు లభించిన మరో గొప్ప అవకాశం 
జనవరి 2019 లో తెనాలి లో జరిగిన అజో విభో కందాళం వారి సాంస్కృతిక కార్యక్రమాల లో ప్రార్థన గా ఈ పద్యం పాడే అవకాశం మాకు లభించింది. 

సాపాసా వెబ్ సిరీస్ 'శివస్తుతి' ప్లే లిస్ట్ పూర్తి గా ఇక్కడ వినచ్చు 

ఇట్లు 
సా పా సా 






Comments