పెళ్ళివారమండి - ఒక చిట్టి సినిమా


పెళ్ళివారమండి 
సుష్మ సౌమ్య ల తెలుగు షార్ట్ ఫిలిం 

మా అమ్మ సుభాషిణి నిట్టల గౌరీ పూజ ఫోటో 


ఏమిటీ పెళ్ళివారమండి?
నేను, అనగా సుష్మ, నా చెల్లెలు సౌమ్య వ్రాసి, తీసిన చిట్టి సినిమా ఈ పెళ్ళివారమండి. 15 నిముషాలు ఒక whacky ప్రపంచంలోకి తీసుకువెళ్తాం మిమ్మల్ని.  

మా గురించి 
సుష్మ సౌమ్య - మేము ఇద్దరం అక్కా చెల్లెళ్ళము.  సంగీతం, మీడియా, సినిమా రంగాల్లో కలిసి పనిచేస్తూ ఉంటాము.  త్వరలో సినిమా తీసే ప్రయత్నం లో ఉన్నాము. 

పెళ్ళివారమండి నేపథ్యం, విశేషాలు 

పెళ్ళివారమండి స్క్రిప్టు 
మీరు హరీ పాటర్ ఫాన్స్ అయి ఉంటె గనక మీకు 'muggle blood' 'pure blood' అనే పదాలు తెలిసి ఉంటాయి.  అంటే మేజిక్ కుటుంబంలో ఉన్నవారు, మ్యాజికేతరులు అన్నమాట - అలాగే ఈ కథ లో రెండు కుటుంబాలు తెలుగేతర కుటుంబాలన్నమాట. 

పెళ్లి సంబంధాల టైం లో ఈ రెండు కుటుంబాలు పడే అవస్థ అంతా ఇంతా కాదు.  ఎవరిలో తెలుగుదనం ఎక్కువ ఉంది, ఎవరి కుటుంబం ఒక pure తెలుగు కుటుంబం అనే తాపత్రయం లో ఉంటారు అంతా.  

వెయ్యి అబద్ధాలు ఆడి అయినా ఒక పెళ్లి చెయ్యాలి అని అంటారు - కానీ ఈ రెండు కుటుంబాలు అన్ని నిజాలు చెప్పుకొని ఒకటవుతారు.  
ఇటు మగపెళ్లివారు, అటు ఆడపెళ్ళివారు ఏం దాస్తున్నారు? ఆ నిజాలు ఏంటి, చివరికి ఏమైంది అన్నదే పెళ్ళివారమండి షార్ట్ ఫిలిం.

తెర వెనుక కథ 
సౌమ్య సెట్ లో 
నిజంగానే జీవితం లో కొన్ని మంచి విషయాలు ప్లాన్ చేసుకోకుండా జరిగిపోతాయి.  మా జీవితంలో ఈ షార్ట్ ఫిలిం కూడా అంతే.  ఒక శ్రేయోభిలాషి డబ్బు ఎదురు ఇచ్చి మరీ ప్రోత్సహించి తీయించారు.  
అప్పటికే మేము ఇద్దరం చేసిన షార్ట్ ఫిలిం 'హోమ్ స్వీట్ హోమ్' కి నేషనల్ అవార్డు వచ్చింది. ఆ తరువాత ఎగ్జామ్స్ అని జీరో బడ్జెట్ లో మా ఇంటి పక్కన ఆడుకుంటున్న పిల్లలతో సరదాగా ఒక షార్ట్ ఫిలిం చేసాము.


ఒక కీలకమైన సన్నివేశం డైరెక్ట్ చేస్తూ  
పెళ్ళివారమండి చాలా సరదాగా మొదలుపెట్టిన ప్రాజెక్ట్. 
ఇందులో కనిపించే ప్రతి నటి/నటుడు మా స్నేహితులే.  అవ్వి వారి నిజం పేర్లే.  ఆ ఇళ్ళు కూడా స్నేహితులవే. ఒకటి రెండు సవరణలు తప్ప, వారి జీవితాలు కూడా అవ్వే.


ప్రీ ప్రొడక్షన్ - షూటింగ్ - పోస్ట్ ప్రొడక్షన్  

మేము తీసుకున్న నటీ నటులంతా మా స్నేహితులు, వేరే వేరే ప్రొఫెషన్స్ లో ఉన్నవారు.  వారికి ఇది ఒక ఆటవిడుపు. ఒక ఎక్స్పీరియన్స్ ... 
డబ్బింగ్ 

కానీ rehearsal విషయం లో ఎటువంటి షార్ట్ కట్ లు తీసుకోలేదు - ప్రతి డైలాగు, బాడీ లాంగ్వేజ్ అందరికి బట్టి వచ్చేలా చూశాము.  వారాంతాల్లో ఒకరి ఇంట్లో చేరి rehearsal చేసేవాళ్ళము. 


తిల్లాన రికార్డింగ్ ముందు 
ఈ సినిమా లో ఒక తిల్లాన ఉంది - బాలమురళీకృష్ణ గారి కదనకుతూహలం తిల్లానా. నేను ఎం ఏ మ్యూజిక్ చేస్తున్నప్పుడు నా క్లాస్ మెట్ పార్థు చేత నూకల గారి స్టూడియో లో ఆ తిల్లానా పాడించాము. 


షూటింగ్ కి ముందు అందరి లుక్, కాస్ట్యూమ్స్ అన్ని డిసైడ్ చేసుకున్నాము.  తెలిసిన వంట వారికి షూటింగ్, rehearsal అప్పుడు కావలసిన ఫుడ్ అవ్వి ఆర్డర్ ఇచ్చేసుకున్నాము.  మొత్తం టీం అంతా foodies కాబట్టి షూటింగ్ తో సమానమైన జాగ్రత్తలు తీసుకున్నాము మెనూ లో 😝
రెండు రోజుల్లో పూర్తి చేశాం షూటింగ్.  ఆ తరువాత ఎడిటింగ్ డబ్బింగ్ ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేశాము. ఆ తరువాత మేము ఒక తమాషా చేశాం.  
dop వరప్రసాద్ గారు



మేం చేసిన తమాషా  
సాధారణంగా సినిమా అంటే మాకు ప్రసాద్స్ ఐమాక్ ఆస్థాన థియేటర్ అన్నమాట - ఇండస్ట్రీ మిత్రుల ప్రీమియర్ లు, మాకు నచ్చిన హాలీవుడ్ బాలీవుడ్ సినిమాలు అన్ని ప్రసాద్స్ ఐమాక్స్ లో చూడటం మాకు సాంప్రదాయం గా మారిపోయింది. 


మా మొదటి సినిమా invitation 
ఈ షార్ట్ ఫిలిం చక్కగా పెద్ద సినిమా లెవెల్ లో ప్రొడక్షన్ వాల్యూస్ తో తీశాక - దీని ప్రదర్శన గురించి ఆలోచించినప్పుడు ఒక ఐడియా వచ్చింది.



పెళ్ళివారమండి షార్ట్ ఫిలిం రిలీజ్ ఐమాక్స్ స్క్రీన్ 5


ఆ ఐడియా అమలు చేసి, ఐమాక్స్ లో స్క్రీన్ 5 లో ఈ షార్ట్ ఫిలిం రిలీజ్ చేశాము.  

స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఈ సినిమా కోసమే వచ్చినవారు - ఓహ్ ..  ఆ పూట సందడి పండుగ లాగ అనిపించింది.  


మరో ప్రదర్శన ప్రసాద్ లాబ్స్ స్క్రీన్ లో ఆరెంజ్ చేశాము.  అంతా చాలా బాగా జరిగింది.  ఇప్పుడు ఈ షార్ట్ ఫిలిం మా యూట్యూబ్ ఛానల్ సా పా సా వెబ్ సిరీస్ లో ఉంది. 

పెళ్ళివారమండి ఫేస్బుక్ పేజీ లో మరిన్ని విశేషాలు చూడచ్చు. ఇక అత్యంత సంతోషకరమైన విశేషం ఏంటంటే, ఈ షార్ట్ ఫిలిం కి 2017 లో బెస్ట్ కామెడీ క్యాటగిరి లో అవార్డు రావడం.

ప్రసాద్ లాబ్స్ లో జరిగిన అవార్డు ఫంక్షన్ లో సుష్మ సౌమ్య
పెళ్ళివారమండి బెస్ట్ కామెడీ కేటగిరీ

ఇవ్వీ పెళ్లివారమండి విశేషాలు.  

ఇట్లు 
సుష్మ, 
సా పా సా 

Comments